Central Govt | లోక్‌సభ స్థానాలు 850కి పెంపుకై…

Central Govt | లోక్‌సభ స్థానాలు 850కి పెంపుకై…
Central Govt |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. లోక్‌సభ స్థానాలను గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తోంది.
భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన వివరాలను ఎంపీలకు కేంద్రం అందజేసింది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
