notice | ఈడీ విచారణకు చెవిరెడ్డి భార్య, కొడుకు

notice | ఈడీ విచారణకు చెవిరెడ్డి భార్య, కొడుకు

ఏపీ లిక్కర్ స్కామ్‌

notice |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు.

ఈడీ నోటీసుల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన కుమారుడు విచారణాధికారుల ముందు హాజరైనట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. మనీలాండరింగ్ కోణంలో లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని విచారిస్తున్న అధికారులు బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, నిధుల బదిలీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply