పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం..

పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం..

  • లారీని ఢీకొన్న కారు
  • 3 ఏళ్ల చిన్నారి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఇందిరా కాలనీ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో మూడు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే పాల్వంచ ఆసుపత్రికి తరలించారు.

బాధితులను మధిరకు చెందిన వైద్యులుగా గుర్తించారు. వారు మధిర నుండి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply