Nirmal చెన్నూరులో గడ్డి వాము దగ్ధం
Nirmal చెన్నూరులో గడ్డి వాము దగ్ధం
- సుమారు 400 గడ్డి కట్టలు అగ్నికి ఆహుతి
నిర్మల్ జిల్లా Nirmal , ఆంధ్రప్రభ: దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో బుధవారం గడ్డి వాము దగ్ధమైంది. దాసరి సుధాకర్, లషెట్టి శ్రీను లకు చెందిన గడ్డి వాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 400 గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
