Narsimhulapet మోదీ సంకల్పంలో భాగస్వాములు కావాలి

Narsimhulapet మోదీ సంకల్పంలో భాగస్వాములు కావాలి

  • ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత రాంచందర్ రావు పిలుపు

నర్సింహులపేట Narsimhulapet, ఆంధ్రప్రభ:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

బుధవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో “ఏక్ పెడ్ మాకే నామ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పర్యావరణ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి విస్తరించాలని సూచించారు. ప్రతి ఇంటిలో తల్లి పేరుతో ఒక మొక్క నాటేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు కుంభం అశోక్ రెడ్డి, మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్, దాసరి మురళి, దాసరి వీరన్న, చిన్నాల ప్రవీణ్, బల్గూరి వెంకట్ రెడ్డి, ఎర్ర వెంకట్ రాంనర్సయ్య, కాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply