- ఎఫ్డీపీటీ వినతిపత్రం ఇచ్చిన అఖిలపక్ష నేతలు
జన్నారం, (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని అటవీ చెక్‌పోస్టుల మీదుగా అన్ని వాహనాల రాకపోకలను అనుమతించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శాంతియుత నిరసన చేపట్టారు.
ఆ తర్వాత మంచిర్యాల సీసీఎఫ్, కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ ఎస్. శాంతరాంకు, మంచిర్యాల్ డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చారు.
స్థానిక ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూ డబ్ల్యూ ఎస్ అధికార్ల సమావేశం జరుగుతుందని తెలుసుకున్న స్థానిక అఖిలపక్ష నేతలు ఎం. రాజశేఖర్, ఎస్.భూమాచారి,ఎం.డి రియాజోద్దీన్,సొహెల్ షా,మోహన్ రెడ్డి,సుభాష్ రెడ్డి, ముత్తె శ్రీనివాస్,శంకరయ్య,అజ్మత్ ఖాన్,కె.సందీప్, నందునాయక్,గణేశ్, వ్యాన్, లారీ అసోసియేషన్ నేతలు, తదితరులు సాయంత్రం అక్కడికి చేరుకొని ఫ్లెక్సీతో శాంతియుత నిరసన తెలిపారు.
ఆ తర్వాత భారీ,సాధారణ వాహనాల రాకపోకలకు లక్షెట్టిపేట,జన్నారం మీదుగా ఉట్నూర్, కడెంకు ఎలాంటి రుసుము లేకుండా 24 గంటలు అన్ని అటవీశాఖ చెక్పోస్ట్ల గుండా అనుమతించాలని,చెక్పోస్టుల్లో డ్రైవర్లను,యజమానులను వేధింపులకు గురి చేయకూడదని పేర్కొన్నారు.
వెంటనే మంచిర్యాల సి.ఎఫ్,ఎఫ్.డి.పి.టి చర్యలు తీసుకొని టైగర్ జోన్ పరిధిలోని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.ఈ సందర్భంగా శాంతారాం మాట్లాడుతూ,అన్నీ వాహనాల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు.
ఎన్నికల కోడ్ దృశ్య జాప్యం జరుగుతుందని,అనుమతి రాగానే తాను స్థానిక అటవీ అధికారులకు సర్క్యులర్ జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్ష నేతలకు నచ్చ చెప్పారు.