Harish Rao Donation | ఒక సంవత్సరం జీతం దానం చేసిన హరీష్ రావు
Harish Rao Donation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి తన ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఈరోజే చెక్ అందజేస్తానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు భావోద్వేగంగా మాట్లాడుతూ… పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే వేదనను వర్ణించారు. అలాంటి చిన్నారులకు చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నది సత్య సాయి సంజీవని ఆసుపత్రి అని ఆయన కొనియాడారు.
చిన్నారుల గుండె శస్త్రచికిత్సల ద్వారా కేవలం పిల్లలనే కాకుండా వారి తల్లిదండ్రుల జీవితాలను కూడా కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఈ సేవలను దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయంగా ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు.
