జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యతే మార్గం
- టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశంలో
- వనపర్తి జిల్లా జర్నలిస్టుల సమస్యలపై సమర్థవంతమైన ప్రసంగం
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర స్థాయి సమావేశంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరం రామకృష్ణారెడ్డి జిల్లా తరఫున ప్రసంగించి సభలో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్, సంక్షేమం, భద్రత, అధికారుల సహకారం వంటి ప్రధాన సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. మండల స్థాయి వరకు సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువ జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర సంఘం చేపట్టే ప్రతి ఉద్యమానికి, ప్రతి కార్యక్రమానికి వనపర్తి జిల్లా యూనిట్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతే సమస్యల పరిష్కారానికి బలమైన మార్గమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నిరంజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజు, బాలముకుందం తదితరులు పాల్గొన్నారు.
