prisoners | చంచల్‌గూడ జైలులో ‘ఫీల్ ది జైల్’ ప్రారంభం

prisoners | చంచల్‌గూడ జైలులో ‘ఫీల్ ది జైల్’ ప్రారంభం

prisoners | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన మ్యూజియం, ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖైదీల్లో పరివర్తన తీసుకురావడంలో జైలు సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఓపెన్ జైలు విధానం మంచి ఫలితాలు ఇస్తోందని గవర్నర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న సమయంలో తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచడం కంటే వారిలో మానసిక మార్పు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

జైళ్లలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే ఖైదీల్లో సానుకూల మార్పు వస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఖైదీల పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply