కన్నాయిగూడెం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా జాడి రాంబాబు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాడి రాంబాబును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలతో కలిసి సమిష్టిగా పనిచేస్తానని పేర్కొన్నారు.