Advocate |అరుదైన గౌరవం..

సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్‌గా గుండ్లపహాడ్ ముద్దుబిడ్డ
Advocate | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ, హైకోర్టు అడ్వకేట్ పడాల ప్రవీణ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్‌గా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే మూడేళ్ల పాటు తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కీలక కేసులను వాదించే బాధ్యతలను ప్రవీణ్ కుమార్ నిర్వర్తించనున్నారు. ఇంతకుముందు ఆయన హైకోర్టులో లోకాయుక్త, ఉపలోకాయుక్తలకు కౌన్సిల్‌గా సేవలందిస్తూ న్యాయరంగంలో విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు.
గుండ్లపహాడ్ గ్రామం నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వ న్యాయ ప్యానెల్‌లో చోటు సంపాదించుకోవడం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, న్యాయవర్గ ప్రముఖులు ప్రవీణ్ కుమార్‌ను అభినందిస్తూ ఫెలిసిటేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ, గుండ్లపహాడ్ పేరు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వినిపించేలా ప్రవీణ్ కుమార్ సేవలు మరింత విస్తరించాలని, యువతకు ఆయనను ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. గుండ్లపహాడ్ ముద్దుబిడ్డకు లభించిన ఈ అరుదైన గౌరవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
