కల్తీ కారంపై అధికారుల దాడులు

కల్తీ కారంపై అధికారుల దాడులు
వరుస దాడులతో వ్యాపారాల్లో గుబులు
ప్రజల ప్రాణాలతో చేలాగాటమాడితే సహించం
వార్నింగ్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్
వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : కల్తీ కారం తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చేలాగాట మాడుతున్న అక్రమ వ్యాపారుల భరతం పడుతున్నారు.అక్రమార్జన కోసమై అక్రమార్కులు అక్రమంగా దందా చేస్తున్న వ్యాపారుల మూలాలపై అధికార యంత్రాంగం కన్నేసింది. అక్రమ సంపాదన కోసమై అడ్డదారులు తొక్కుతున్న కల్తీ కారం తయారీదారుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఆహార నియంత్రణ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేస్తూ చీటర్స్ చేస్తున్న చీకటి బాగోతాన్ని బట్ట బయలు చేస్తున్నారు. ముఖ్యంగా మిర్చి మార్కెట్ సీజన్ లో అతి తక్కువ ధర పలికే తాలు మిర్చి కొనుగోళ్ళు చేయడమే కాక వాటిని తొడిమేలతో కల్పి మంచి రంగు వచ్చే రసాయనాలతో అత్యుత్తమైన కారం తయారీ చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. ఇల్లీగల్ దందా చేస్తున్న అక్రమ వ్యాపారులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
ఏనుమాముల మార్కెట్ సమీపంలో విచ్చలవిడిగా కల్తీకారం తయారీ చేసే తయారీ కేంద్రాలు ఉన్నట్టు పక్కా సమాచారం సేకరించారు. కల్తీకారం తయారు చేస్తున్న ఇండస్ట్రీస్ పై ఆహార నియంత్రణ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల్లో గుబులు పుట్టిస్తున్నారు.శుక్రవారం
హేమ శ్రీ ఇండస్ట్రీస్ లో కల్తీకారం తయారీ చేస్తున్న సమయంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు తయారీ ఇండస్ట్రీని సీజ్ చేశారు. తయారీ కేంద్రం నుండి కారం శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. శాంపిల్స్ బాగోతాన్ని గుట్టురట్టు చేసేందుకు ల్యాబరేటరీకి పంపించారు. 6 లక్షల విలువ చేసే తొడిమలతో పట్టిన కల్తీకారాన్ని అధికారులు సీజ్ చేశారు.
