చౌటుప్పల్‌లో ఘనంగా వనమహోత్సవం..

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు తిరుమల వెంచర్‌లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని అన్నారు.

కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రజలు, కాలనీవాసులు తమ కర్తవ్యంగా భావించాలని కోరారు. తిరుమల టౌన్షిప్ కాలనీ వార్డు కార్యాలయ ప్రాంగణంలో నీడనిచ్చే, పూలు పూసే పలు రకాల మొక్కలను ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు కలిసి నాటారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలే శ్రీలత చిరంజీవి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమా మహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, ఎండీ హన్ను, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, ఎండీ బాబా షరీఫ్, షేక్ నబీబి జానీబాబు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, తిరుమల టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు మేడి రాములు, స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.