విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్వీ పోరుబాట..

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్వీ పోరుబాట..

  • మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్వీ నిర్వహించనున్న పోరుబాటకు సంబంధించిన పోస్టర్‌ను హనుమకొండలోని తన నివాసంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తీవ్రంగా విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో వారు ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

విద్యార్థుల సమస్యల దృష్ట్యా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర, కాకతీయ యూనివర్సిటీ రజక సంఘం ఇన్‌చార్జ్ కోరపెల్లి రాజేష్, బొమ్మ ఉజ్వల్, నడికూడ మండల అధ్యక్షుడు ధురీశెట్టి రేవంత్, పరకాల రూరల్ అధ్యక్షుడు గొట్టే అజయ్, కంటత్మకూర్ గ్రామ అధ్యక్షుడు గుడికందుల శివ, ఐలోని అభిషేక్, గండ్రకోట పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply