మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి..

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి..

  • ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్
  • రూ.10 లక్షలతో మహిళా శక్తి భవన నిర్మాణం
  • మహిళా శక్తి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ పేర్కొన్నారు. కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా శక్తి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమూద్ పట్నం గ్రామంలో మహిళా శక్తి కార్యాలయం ను స్వయం సహాయక సంఘాల మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళా శక్తి భవనాలను ఉపయోగించు కోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.

అంతేకాకుండా మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని , సెర్ఫ్ మహిళా శక్తి భవనాలు మంజూరు చేసి వారి యొక్క సమస్యలు పరిష్కరించు కోవడంలో కార్యాలయాలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, బండారు వెంకన్న, ఎంపీడీవో క్రాంతి, ఎంపీఓ హరీష్, ఎస్సై క్రాంతి కిరణ్, మహమూద్ పట్నం గ్రామ సర్పంచ్ కట్ల ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఏశబోయిన అమృత శ్రీనివాస్, వార్డు మెంబర్లు పెనుమాండ్ల సోమయ్య, దాసరి లచ్చమ్మ, వివో చింతమళ్ళ సంధ్య, వివో భూక్య నెహ్రూ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టగడుపుల యాకూబ్, బద్దుల వెంకటమల్లు, చిలువేరు లింగయ్య, బద్దుల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముంజాల శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్లు ఎలిజాల యాకయ్య , కాసోజు యాకాంత చారి, గుండెపురి వెంకన్న , పోలు నరసయ్య, పిట్టల ఉపేందర్, భోగ శంకర్, ముంజాల యాకన్న, సిలివేరి గణేష్, సిలివేలు శివాజీ, దేశ బోయిన అనిల్, ఏశబోయిన సంపత్, మందుల అమర్నాథ్, మందుల ముత్తయ్య, భూక్యారం తండా సర్పంచ్ జాటోత్ సోమీ, తర్య తండా సర్పంచ్ బుజ్జి శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ సిలివేరు భీమయ్య, కాసోజు వెంకటాచారి, కాంబోజు యాకయ్య, పులుగుజ్జా నారాయణ, చంద వెంకన్న మహిళా మణులు కాసోజు రమ మాదారపు పూలమ్మ, గుండ్ల సుశీల, ఎలిజాల భాగ్యమ్మ, కట్ల లచ్చమ్మ, స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *