ఎస్ఐఆర్‌కు గ్రామస్తులు సహకారం అందించాలి

  • సర్పంచ్ ప్రసాద్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ఆర్ఐ ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని అరుగులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని తహసిల్దార్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో మంగళవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ గ్రామస్తులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ చేపట్టారని, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లకు నమోదు చేసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, జీపీవో,బిఎల్ వో చరణ్, నాయకులు మాజీ సర్పంచ్ సంగెం శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.