ఘనంగా ఉపాధ్యాయురాలి పదవీ విరమణ..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా సుదీర్ఘకాలం సేవలందించిన మనోరమమంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగర్సు రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, మనోరమ గత 37 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. ఉద్యోగంలో పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని, అయితే ఆమె అందించిన విద్యా సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మనోరమ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని, ఆమె భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. తోటి సిబ్బంది, విద్యార్థులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.