పది ఫలితాల్లో టీజీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ 100 శాతం ఉత్తీర్ణత..

పది ఫలితాల్లో టీజీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ 100 శాతం ఉత్తీర్ణత..
చిట్యాల మండల టాపర్ గా శ్రీజ..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రకటించిన పది ఫలితాల్లో మండల కేంద్రంలోని టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ జూనియర్ కాలేజీ బాలికలు 100 శాతం ఉత్తీర్ణ సాధించినట్లు ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి తెలిపారు. చిట్యాల మండల టాపర్ గా అదే గురుకులానికి చెందిన డి శ్రీజ550/600, నిలిచిందన్నారు.
గురుకులంలో ఉన్న 77 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు బిక్షపతి తెలిపారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ బిక్షపతి, ఉపాధ్యాయ బృందం, అభినందించారు.
