Gold | పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold | పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి.
బుధవారం ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3980 పెరిగి రూ.1,53,820కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.3650 పెరిగి రూ.1,41,000కు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. కిలో వెండిపై రూ.10,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ ధర రూ.2,65,000కు చేరింది.

ఇదిలా ఉండగా ఇరాన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా, స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురైంది. సీజ్‌ఫైర్ ప్రకటనతో పెట్టుబడిదారులు బంగారం, వెండిపై పెట్టుబడులు పెంచడం, కొనుగోళ్లకు డిమాండ్ అధికంగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
