భారీ బంగారం విరాళం..

భారీ బంగారం విరాళం..

100 గ్రాముల స్వచ్ఛమైన బంగారం సమర్పించిన భక్తుడు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి స్థానిక భక్తుడు భారీ విరాళాన్ని సమర్పించారు. విజయవాడ చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన భక్తుడు దొడ్ల నారాయణ రావు 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారు కడ్డీని మంగళవారం దేవస్థానం అధికారులను కలిసి అమ్మవారికి కానుకగా సమర్పించారు. మార్చి 2026 నాటి 24 క్యారెట్ల బంగారం ధర ప్రకారం ఈ విరాళం సుమారు రూ 16,87,100 విలువ కలిగి ఉందని అంచనా దాతకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు వేద ఆశీర్వచనం అనంతరం టెంపుల్ ఏఈఓ వెంకట్ రెడ్డి ప్రధాన ఆలయ సూపర్నెంట్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం రసీదులను అందజేశారు.

Leave a Reply