ప్రతి ఇంట జాతీయ పతాకం ఎగరవేయాలి

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో పిలుపునిచ్చిన బీజేపీ నేత సంధ్యారాణి

గోదావరిఖని, ఆంధ్రప్రభ: దేశభక్తి భావనను చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. గోదావరిఖని పట్టణంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల క్రీడా మైదానంలో మాజీ సైనికులు, వాకర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 10 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మాజీ సైనికులను సన్మానించారు. వాకర్స్‌, మాజీ సైనికులతో కలిసి దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.