Godadevi | వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ

Godadevi | వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ

  • పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు

Godadevi | మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఇవాళ గోదాదేవికి సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమలాపురం పాత ఊరులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి భక్తులు ఊరేగింపుగా ఆటో స్టాండ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా రామాలయానికి చేరుకున్నారు.

Godadevi

ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పసుపు కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, నూతన వస్త్రాలతో వివిధ రకాల స్వీట్లు, వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, అలంకార సామాగ్రిని గోదాదేవి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తిరుప్పావై చదివి వినిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రంగనాథుడిని పెళ్లాడాలని తపించిన గోదాదేవి భక్తికి ప్రతీకగా గోదాదేవికి సారెను సమర్పించి, తమ కుటుంబాల కోసం ఆశీస్సులు కోరుకోవడంకోసం విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Leave a Reply