స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
వైరా, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుభ్రం చేయటంతో నా జన్మ ధన్యమైందని వైరా ఎస్సై పుష్పాల రామారావు పేర్కొన్నారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్య, ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వేడుక ముందస్తుగా వైరా ఎస్సై పుష్పాల రామారావుతో పాటు కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్యలు అంబేద్కర్ విగ్రహాన్ని స్వయంగా నీటితో కడిగి శుభ్రం చేశారు. నిర్వాహకులతో కలిసి విగ్రహం చుట్టూ ఉన్న చెత్తను చీపురుతో శుభ్రం చేసి, విగ్రహాన్ని నీళ్లతో కడిగి నివాళులు అర్పించారు.
ఇది అంబేద్కర్ పట్ల గౌరవాన్ని, సామాజిక బాధ్యతను చాటిచెప్పే కార్యక్రమంగా నిలిచింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్న వేళ బలమైన, ఐకమత్యంతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని వారి దార్శినికతకు ప్రతి ఒక్కరూ నిబద్ధతను పునరుద్ఘాటించాలని కోరారు. మహానుభావుని విగ్రహాన్ని పరిశుభ్రంగా కడిగే భాగ్యం మాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్య, ఏలీయా నందిగామ మనోహర్, గద్వాల రవీందర్, యాండ్రాతి బాబు, కన్నెగంటి సాంబ తదితరులు పాల్గొన్నారు.
