యువత సామాజిక బాధ్యత తీసుకోవాలి
యువత సామాజిక బాధ్యత తీసుకోవాలి
గంజాయి నివారణకు సహకరించాలి: సీఐ ఎల్. పవన్ కుమార్
మరిపెడ, ఆంధ్రప్రభ: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక సమతుల్యతను పొందాలని, అదే విధంగా సామాజిక బాధ్యత తీసుకుని సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. పవన్ కుమార్ సూచించారు.
మండలంలో గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల పారితోషికం అందజేస్తామని తెలిపారు.
బుధవారం మరిపెడ మున్సిపాలిటీలోని సన్‌రైజర్స్ క్లబ్ సభ్యులకు నూతన జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా సన్‌రైజర్స్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు.
క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా గంట్ల మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గంట్ల గౌతమ్ రెడ్డి, ప్రధాన సలహాదారులుగా మెరుగు రాము, సలహాదారులుగా ఎం.డి. రియాజ్ పాషా, బోడ లక్ష్మణ్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా గంట్ల ప్రదీప్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడిగా అర్కావత్ ప్రకాష్, ఉపాధ్యక్షుడిగా దస్రా, ప్రధాన కార్యదర్శిగా బి. వెంకన్న (డీజే), కోశాధికారిగా బి. నరేష్, సంయుక్త కార్యదర్శిగా బోడ రవి, కార్యదర్శులుగా వెంకటేష్, బోడ శ్రీనులను ఎన్నుకున్నారు.
నూతన కమిటీకి సీఐ, ఎస్ఐలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడమే తమ క్లబ్ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి, రవి, ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు షేక్ యాకుబ్ పాషా పాల్గొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకంగా డే అండ్ నైట్ బంతుల కిట్‌ను అందజేశారు.
