శివనగర్ లో ఉచిత వైద్య శిబిరం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ అన్నారు. ఆదివారంశివనగర్ 34వ డివిజన్ కెపిఎస్ ఫంక్షన్ హాల్లో మంత్రి కొండా దంపతుల ఆదేశంతో కాంగ్రెస్ నగర నాయకులు పగడాల సతీష్ ఆధ్వర్యంలో శరత్ మాక్సి విజన్ కంటి పరీక్షలు, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం చే ఉచిత మెగా వైద్య శిభిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ పాల్గొని కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 50 మందికి కంటి పరీక్షలు, సుమారు 100 మందికి జనరల్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్య శిబిరంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, 35 వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీరామ్ రాజేష్, మార్కెట్ చైర్మన్ బండి జనార్దన్ ,కాన్నోజు లావణ్య,సారా సాంబయ్య అక్షిత్ పటేల్,అబ్బోజు తిరుపతి,శెట్టి అరుణ,మంతెన సునీత, గజ్జి విజయ స్వప్న, జయ, శ్రీలత, సోమలక్ష్మి, మంజుల, పగడాల రాజేష్, సముద్రాల రవిచందర్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
