Medchal | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

Medchal | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ( Indira Gandhi) జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ 19 నవంబర్ 1917లో జన్మించారు. ఆమె భారత తొలి మహిళా ప్రధానమంత్రి. దేశ అభివృద్ధి, వ్యవసాయం, విజ్ఞానం, రక్షణ రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని భారతాన్ని బలమైన దేశంగా తీర్చిదిద్దారు.
1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో ఆమె నాయకత్వం ప్రపంచం గుర్తించింది. గ్రీన్ రివల్యూషన్ (Green Revolution) ద్వారా ఆహార లోటు ఉన్న దేశాన్ని ఆహార సంపన్న దేశంగా మార్చారు. 1984లో ఆమె మరణించినా, ఆమె సేవలు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కొనియాడడం జరిగింది. ఆమె ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకారబోయిన మల్లేష్, మాజీ సర్పంచ్ లు బండారి నరేందర్, కందాడి నరేందర్ రెడ్డి, గువ్వ రవి, మారేపల్లి సుధాకర్, ఫిల్లిప్స్, గడిల కృష్ణారెడ్డి, గడిల మధుసుధన్ రెడ్డి, వినోద్ గౌడ్, అబ్రర్, సురేష్, మహేందర్ వర్మ, రాజేందర్, బలరాంరెడ్డి, వెంకట్, ఉదయ్ గౌడ్, రాధా కృష్ణ, వినోద్, సంపత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
