కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. అజయ్ కుమార్ తో ఆయన తనయుడు పువ్వాడ నయన్ రాజ్ కూడా ఉన్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన జన్మదినం సందర్బంగా ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా పువ్వాడ అజయ్ కుమార్ వారికి ధన్యవాదములు తెలిపారు. పువ్వాడతో పాటు ఆయన తనయుడు నయన్ రాజ్ పాల్గొన్నారు.

Leave a Reply