అగ్నికి ఆహుతైన గడ్డివాములు

చిలుపూర్, ఆంధ్రప్రభ: చిలుపూర్ మండలం నష్కల్ గ్రామంలో శుక్రవారం రైతులు నిల్వ ఉంచుకున్న గడ్డి కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.

గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద వరిగడ్డిని కట్టలుగా తయారు చేసి వాములుగా నిల్వ ఉంచుకున్నారు. దాదాపు పదిమంది రైతులు గత పది రోజులుగా యంత్రాల సహాయంతో సుమారు 400 గడ్డి కట్టలను తమ బావుల వద్ద కుప్పలుగా వేసుకున్నారు.

అయితే శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి గడ్డి కట్టలతో పాటు సుమారు 20 ఎకరాల మేర ఉన్న తాడి చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్నది తెలియరాలేదు.

ఈ ప్రమాదంలో గాదె నాగేశ్వరరావు, గాదె కాశయ్య రాజు, శంకర్, మానుక రాజేందర్, సట్ల మధుకర్ రెడ్డి, గాదె రాము తదితర రైతులు నష్టపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply