నిజాయితీని చాటుకున్న ఆలయ సిబ్బంది

నిజాయితీని చాటుకున్న ఆలయ సిబ్బంది

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి అభిషేకం పూజలు చేసుకున్న భక్తురాలు బంగారు కమ్మ చెవిపోగును పోగొట్టుకుంది. విషయం ఆలయ ఇన్స్పెక్టర్ సాయిలు, హోమ్ గార్డ్ దృష్టికి తీసుకెళ్ళింది. విధుల్లో వున్నా హోంగార్డులు రవి, శ్యామ్, ఆలయ ప్రాంగణం నుండి వ్యాస మహర్షి ప్రధాన మెట్లమార్గం వరకు వెతకగా కమ్మ దొరికింది.

దీంతో హైదరాబాద్ కు చెందిన భక్తురాలు వెంకట నాగలక్ష్మికి ఆలయ ఇన్స్పెక్టర్ సాయిలు, హోమ్ గార్డ్ రవి శ్యామ్ బంగారు కమ్మ అప్పచెప్పి తమ నిజాయితీని చాటుకున్నారు. బంగారు కమ్మ విలువ లక్ష పైన ఉంటుందన్నారు. విధుల పట్ల తమ నిజాయితీని చాటుకున్న ఆలయ సిబ్బందిని భక్తులు అభినందించారు.

Leave a Reply