Kaleshwaram | పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలి
కాళేశ్వరం రాజకీయాలకు అతీతం
Kaleshwaram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఖండించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎల్‌నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ఏ చిన్న తప్పు జరిగినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత తీసుకుంటారని అన్నారు.
రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రాణహిత వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు.
