వరి కొయ్యల మంటల్లో రైతులకు భారీ నష్టం

వరి కొయ్యల మంటల్లో రైతులకు భారీ నష్టం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గుంటి చెరువు కింద వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనలో రైతులకు భారీ నష్టం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో 50 ఎకరాలకు పైగా మడికట్లలో ఉన్న గడ్డి పూర్తిగా తగలబడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా రైతులకు చెందిన బోర్లు, స్టార్టర్లు, విద్యుత్ వైర్లు కాలిబూడిదయ్యాయి.

ఈ ఘటనతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు.

Leave a Reply