ఎస్ఐఆర్ను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలి
35వ డివిజన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
కరీమాబాద్ (ఆంధ్రప్రభ): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని బీఎల్వోలకు అవసరమైన దరఖాస్తు ఫారాలను అందజేయాలని మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 35వ డివిజన్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 35వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేణిగుంట్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎల్వోలు ఓటర్ల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించి, వాటిలోని తప్పులను సరిదిద్ది నమోదు చేశారు.
35వ డివిజన్ శివనగర్‌కు చెందిన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు వివరాల సవరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, డివిజన్‌కు చెందిన ఓటర్లు పాల్గొన్నారు.
