England Vs India | శ్రేయస్ చేజారిన శతకం..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ శ‌తకాన్ని చేజార్చుకున్నాడు. ప్ర‌స్తుతం భార‌త్ 44 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 307 ప‌రుగులు చేసింది. ఇక 78 ప‌రుగుల‌తో దూకుడుగా ఆడుతున్న శ్రేయ‌స్ ని అదిల్ ఔట్ చేశాడు.. శ్రేయ‌స్ 78 ప‌రుగుల‌లో రెండు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి..

ఇక ఓపెన‌ర్ శుభ‌మ్ గిల్ అద్భుత శ‌త‌కం సాధించాడు.. 102 ప‌రుగుల‌ను ఎదుర్కొన్న గిల్ 112 ప‌రుగులు చేసి రషిద్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు.. ఈ శ‌తకంలో మూడు సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి..
ఇక కింగ్ కోహ్లీ చాంపియ‌న్స్ ట్రోఫీ కి ముందు ఈ మ్యాచ్ తో ఫామ్ ను అందుకున్నాడు.. ఫ‌స్ట్ డౌన్ బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు.. 55 బంతుల‌ను ఫేస్ చేసిన కింగ్ త‌న 52 పరుగుల‌ను ఒక సిక్స్, ఏడు ఫోర్ల్ తో పూర్తి చేసుకున్నాడు.. కోహ్లీ వికెట్ సైతం అదిల్ కు ద‌క్కింది.. ఇక శ్రేయ‌స్ ఔటైన త‌ర్వాత క్రీజ్ లోకి వ‌చ్చిన హర్ధిక్ 17 ప‌రుగులు చేసి అదిల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక ఆరో వికెట్ ను అక్షర పటేల్ రూపంలో భారత్ కోల్పోయింది.. 13 పరుగులు చేసిన అక్షర్ ను జూ రూట్ పెవిలియన్ కు చేర్చాడు..

మొద‌ట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది . కాగా, టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన భార‌త జ‌ట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఇక రెండో వ‌న్డేలో అద్భుత‌మైన సెంచ‌రీతో అద‌రగొట్టిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్ లో ఒక్క ప‌రుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 ర‌న్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ వికెట్ ఉడ్ కు ద‌క్కింది. ప్రస్తుతం కెఎల్ రాహుల్ 21 , వాషింగ్టన్ సుందర్ 2 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు..

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ర‌వీంద్ర జ‌డేజా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ స్థానాల్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌, అర్ష్‌దీప్ సింగ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవ‌ర్ట‌న్ స్థానంలో టామ్ బాంట‌న్ ను తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *