Elections | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

Elections | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
- అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి
Elections | తిర్యాణి, ఆంధ్రప్రభ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి(Deepak Tiwari) పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో కొనసాగుతున్న గిన్నెదారి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అందించే ఎన్నికల సామాగ్రిని(Election materials) కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మూడో దశ ఎన్నికలను నిర్వహించడానికి ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. దూరమున్న పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపించడానికి ఫారెస్ట్ వాహనాల(Forest vehicles)ను వాడుతామని, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రజలను తరలించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద(At polling stations) వీల్ చైర్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేష్, ఎంపీఓ ప్రశాంత్, ఏఈ సువాస్, నీతి అయోగ్ కార్యక్రమ ప్రత్యేక అధికారి బాలరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
