accident | ముగ్గురు మృతి

accident | ముగ్గురు మృతి

accident |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఇవాళ విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట మండల పరిధిలోని ముమ్మల్లపల్లి సమీప జాతీయ రహదారిపై బొలేరో వాహనాన్ని లారీ బలంగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు బొలేరో వాహనంలో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జు కావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply