సమస్యల పరిష్కారానికి కృషి
డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ పట్టణంలోని 16వ డివిజన్ పరిధిలోని బోయపల్లి, మహమ్మద్‌ఖాన్‌పల్లి తండాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించేందుకు డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు, స్థానిక నాయకులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరాబాయి, శీను నాయక్, తండా పెద్దలు వి. గోపాల్ నాయక్, వీరుక్యా నాయక్, వి. లక్ష్మణ్, కే. రవి, వి. కాంత్ కుమార్, కే. రాజేష్, కే. హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
