కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్
జన్మదిన వేడుకల అనంతరం ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు
ఎడపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జన్మదిన వేడుకల్లో భాగంగా మొదట జానకంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ నాయకు పులి శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరింత కాలం ప్రజాసేవ చేయాలని స్వామివారిని ప్రార్థించారు.
జైతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. అనంతరం ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగుల రాజుగౌడ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమము లో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
పార్టీ శ్రేణులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. భవిత పాఠశాలలో పార్టీ శ్రేణులు విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.అనంతరం ఎడపల్లి మండల కేంద్రం నుండి పులి శ్రీనివాస్ స్వగ్రామమైన అటువంటి ఏఆర్పి క్యాంప్ వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏ ఆర్ పి క్యాంప్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నాగుల రాజు గౌడ్ సహా సుమారు 52 మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక సర్పంచ్ పురమళ్ళ వినోద్ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నాగుల రాజు గౌడ్, ఏ ఆర్ పి క్యాంప్ గ్రామ సర్పంచ్ వినోద్, జానకంపేట్ గ్రామ మైనారిటీ అధ్యక్షులు తాహర్ లు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న నాయకుడు పులి శ్రీనివాస్ అని కొనియాడారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి, ప్రజా సంక్షేమానికి ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తమ అభిమాన నాయకులు మరెన్నో జన్మదినాలు ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
