బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తా
టియూఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రామిడి కుమార్
క్యాతన్‌పల్లి, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): తెలంగాణ ఉద్యమకారుల సమితి (టీయూఎస్) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణాపూర్‌కు చెందిన రామిడి కుమార్‌ను నియమించారు. ఈ మేరకు టీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి శంకర్‌గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో రామిడి కుమార్ అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యమకారుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు.
జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించినందుకు రామిడి కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి శంకర్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉద్యమకారుల హక్కుల కోసం అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. జిల్లాలోని ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
