వైద్యుల నిర్లక్ష్యంతో..

వైద్యుల నిర్లక్ష్యంతో..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ ఆసుపత్రి పని తీరు మాత్రం మారడం లేదు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీల వార్డులో మంగళవారం పచ్చి బాలింత హరిత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మచిలీపట్నం బైపాస్ రోడ్డు వాసవి భవనం ప్రాంతంకు చెందిన హరిత సోమవారం సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం ఐసియుకు తరలించకుండా, సాధారణ వార్డుకు తరలించారు.
ఆపరేషన్ చేయించుకున్న బాలింతను సాధారణ వార్డులో డాక్టర్లు పర్యవేక్షణ లేకపోవడం మొదట ఆపరేషన్ చేసి సాధారణ వార్డుకు తరలించిన అనంతరం ఆమెకు తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో డాక్టర్లు మరలా ఆపరేషన్ చేశారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక పాపకు మూడు సంవత్సరాలుగా వారి మరో పాపకు ఒక్కరోజు. మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
