గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్రగాయాలు..

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్రగాయాలు..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఊర్కొండ మండలంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై సూర్యలత కాటన్ మిల్లు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కర్కస్ తండాకు చెందిన సభావత్ అంజి నాయక్ రోడ్డుపై కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Leave a Reply