99వ జయంతి వేడుకలు..

99వ జయంతి వేడుకలు..

రావి శోభనాద్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టిడిపి నాయకులు

గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రావి శోభనాద్రి చౌదరి 99వ జయంతి వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మరియు టిడిపి నాయకులు రావి శోభనాద్రి చిత్రపటానికి పూల మాలల వేసి నివాళులు అర్పించారు. జోహార్ రావి శోభనాద్రి అంటూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… టిడిపి ఆవిర్భావం నుండి గుడివాడలో పార్టీ ఉన్నతికి రావి శోభనాద్రి అందించిన సేవలు ఎనలేనివన్నారు. ఎందరికో రాజకీయ బిక్ష పెట్టిన ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. ముఖ్యంగా గుడివాడలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, పట్టణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ రావి శోభనాద్రి లాంటి మహనీయుల స్ఫూర్తితో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రాము పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ,లింగం ప్రసాద్ యార్లగడ్డ సుధారాణి, చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, కరీముల్లా,షేక్ జానీ, సయ్యద్ జబీన్, షేక్ ఇబ్రహీం, మాదల సునీత, కంచనపల్లి సుబ్రమణ్యం,వసంతవాడ దుర్గారావు, కొల్లి రమ్య,అందుగుల ఏసుపాదం, వంగపండు ఆదినారాయణ, సిరిపురపు తులసీరాణి , సునీత, మెరుగు మాల బ్రహ్మయ్య,తెలుగు యువత, తెలుగు మహిళ, టిడిపి అనుబంధం విభాగాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply