ఘనంగా హిందూ సమ్మేళనం ప్రచార గోడ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన భారీ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోనీ శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో సమ్మేళనానికి సంబంధించిన ప్రచార సామగ్రిని, గోడ పోస్టర్ ను నిర్వాహకులు అభయాంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సమ్మేళనం సభ్యులు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణేఈ ధ్యేయంగా నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు , ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ గోడ పత్రికల ద్వారా గ్రామాలలోని హిందూ బంధువులందరికీ సమాచారం చేరవేసి, సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక హిందూ బంధువులు, ధర్మ పరిరక్షకులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు , సమ్మేళనం నిర్వహణ కమిటీ సభ్యులు ప పాల్గొన్నారు.

Leave a Reply