Dropout | చదువులమ్మగా..

Dropout | చదువులమ్మగా..

  • కర్నూలు కలెక్టర్ అడుగులు
  • చిప్పగిరి హైస్కూలు స్థితి గతి పరిశీలన
  • మధ్యాహ్న భోజనంపై అసంతృప్తి
  • జీరో డ్రాప్ ఔట్స్ పై ఫోకస్
  • 100 శాతం ఫలితమే లక్ష్యం
  • ఇక పదోతరగతికి.. 100 రోజుల ప్లాన్

Dropout | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో పదో తరగతి విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం(Dropout percentage) ఎట్టి పరిస్థితుల్లోనూ జీరోకి తగ్గించాలని, 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి(Collector Dr. A. Siri) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం చిప్పగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ ఆకస్మికంగా వెళ్లి పాఠశాల కార్యకలాపాలు, విద్యార్థుల పరిస్థితి, సదుపాయాల స్థితి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

తనిఖీ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతిలో చదువు మానేసిన విద్యార్థుల సంఖ్యపై హెడ్ మాస్టర్‌ను ప్రశ్నించారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ఒప్పించి, ఆ విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించి, పబ్లిక్ పరీక్షల(public exams)కు సిద్ధం చేసే రీతిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఇతర ఊళ్లకు వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో, పిల్లలను తాత్కాలికంగా సీజనల్ వసతి గృహాల్లో చేర్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. చిప్పగిరి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన డ్రాప్ అవుట్ విద్యార్థులు తేజకుమార్, రోహిణిలతో కలెక్టర్ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. చదువుకుంటేనే జీవితం మారుతుంది, ఉన్నత స్థానాలు అందుబాటులోకి వస్తాయి. వెంటనే పాఠశాలకు తిరిగి రండి” అని ప్రోత్సహించారు.

కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. జీవితంలో లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని,మొబైల్ ఫోన్లు, టీవీలకు ఎక్కువ సమయం వెచ్చించకుండా చదువుకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, శ్రద్ధగా కృషి చేసి జీవితంలో స్థిరపడాలని సలహా ఇచ్చారు.

ఉపాధ్యాయులు బోధించే పాఠాలు సరిగ్గా అర్థమవుతున్నాయా? సబ్జెక్ట్ పరం(Subject wise)గా ఏ సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులు ఓపికగా వివరిస్తున్నారా? అనే అంశాలను విద్యార్థులే చెప్పేలా ప్రశ్నించారు. బాల్య వివాహాల ప్రమాదాలు ఏమిటో విద్యార్థులకు అవగాహన కల్పించి, ఉపాధ్యాయులు కూడా ఇందులో చైతన్యం పెంచాలని సూచించారు.

Action Plan |100 రోజుల యాక్షన్ ప్లాన్…

పదో తరగతి 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా డిసెంబర్ 6 నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్(100 days action plan) అమలు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రతీ సబ్జెక్ట్ టీచర్ ఉదయం రివిజన్, సాయంత్రం పరీక్ష నిర్వహించి, ఆ వివరాలను జిల్లా కేంద్ర పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే ఎఫ్‌ ఎల్‌ ఎన్ పై పాఠశాలలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించిన కలెక్టర్.వంటగదిని శుభ్రంగా ఉంచాలని భోజన రుచిని మెరుగుపరచాలని వంట సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్(compound wall), తాగునీరు, టాయిలెట్ సమస్యలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే ఈ సమస్యలను శీఘ్రమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా తాగునీరు సమస్యపై, వారం రోజుల్లో అదనపు ట్యాప్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply