ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రుల వ్యాఖ్యలపై అభ్యంతరం
ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే: కౌశిక్‌రెడ్డి
కమలాపూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొన్నారు.
‘ప్రజలకు వాస్తవాలు చెప్పాలి’
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలకు బదులు పథకం వివరాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాల గురించి మాట్లాడాలని కౌశిక్‌రెడ్డి అన్నారు. ప్రజా కార్యక్రమాల్లో వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, వాటి ప్రారంభం, లబ్ధిదారులకు పంపిణీకి సంబంధించిన అంశాలపై రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయ వేదికలుగా మార్చకుండా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
