నరసాపురం మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా అమర్‌..

నరసాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ప్రముఖ న్యాయవాది కే. అమరేశ్వరరావు (అమర్‌) నియమితులయ్యారు. ఈ మేరకు నరసాపురం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రామిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నారాయణ నాయకర్‌ చేతుల మీదుగా అమరేశ్వరరావు నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అమర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. నరసాపురం పురపాలక సంఘానికి న్యాయపరమైన సేవలు అందిస్తూ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.

మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా అమర్‌ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. నరసాపురం మున్సిపాలిటీ తరఫున వివిధ న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడంతో పాటు పురపాలక సంఘానికి అవసరమైన న్యాయపరమైన సూచనలు, సలహాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే నాయకర్‌ తెలిపారు. అమర్‌ నియామకంపై పట్టణ ప్రముఖులు, సీనియర్‌ న్యాయవాదులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.