Mallepula Pallaki | ఫ్యాన్స్ కోసం మరో సర్‌ప్రైజ్ !
ఆంధ్రప్రభ : రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ పాట విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిత్రబృందం ఈ పాటను విడుదల చేసింది. పాట విడుదలతో ‘ఇరుముడి’ ప్రమోషన్స్‌లో మరింత జోష్ కనిపించింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాటను నేడు విడుదల చేశామని తెలిపారు. అయితే సినిమా కోసం థియేటర్లలో మరో సర్‌ప్రైజ్ సిద్ధంగా ఉందంటూ అభిమానులను టీజ్ చేశారు.
‘మల్లెపూల పల్లకి’ పాటను సాధారణంగా ఆస్వాదించే అభిమానులతో పాటు.. ప్రత్యేకంగా మరో రకమైన రూపంలో పాటను కోరుకునే వారికి కూడా సర్‌ప్రైజ్ ఉంటుందని జి.వి. ప్రకాశ్ తెలిపారు. సినిమాలో చాలా విషయాలను దాచిపెట్టామని.. వాటన్నింటినీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే వెల్లడించబోమని చెప్పారు.
“సినిమాలో చాలా సర్‌ప్రైజులు ఉన్నాయి. అన్నింటినీ ముందే చెప్పేయం.. థియేటర్లలోనే చూడాలి” అంటూ జి.వి. ప్రకాశ్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచారు. ‘మల్లెపూల పల్లకి’ పాట ఇప్పటికే విడుదల కావడంతో.. ఇక సినిమాలో దాచిన ఆ సర్‌ప్రైజ్‌లు ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.
