Rice|పక్వానికి రాకుండా వరి కోతలు కోయవద్దు

  • వరి కోతలు వాయిదా వేసుకోవాలి
  • జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎన్.పద్మావతి

Rice| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలో ఖరీఫ్ 2025 పంట కాలంలో 1,55,000 హెక్టార్లకుపైగా వరి సాగు చేయటం జరిగిందని, వారి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 35 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎన్.పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా వివిధ రైసు మిల్లులకు చేరిన ధాన్యాన్ని పరిశీలిస్తే రైతులు పూర్తిగా పరిపక్వానికి రాని వరి పంట కోసి రైసు వి ల్లులకు పంపుతున్నట్లుగా గమనించటం జరిగిందన్నారు. రైతులు పరిపక్వానికి రాకుండా వరి పంట కోతలు ప్రారంభించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ బందుగానే పరిపక్వానికి రాకుండా వరి కోతలు కోసినట్టైతే మిల్లుకు చేరిన ధాన్యం ఎక్కువగా తప్పా తాలు గింజలు ఉండే అవకాశం ఉందన్నారు.

గింజ నాణ్యత సరిగా ఉండకపోవటమే కాకుండా, పూర్తిగా తయారు కాకపోవటం, గింజ బరువు తక్కువ ఉండటం, కాటాలో అనుకున్న దానికంటే తక్కువ బర పు నమోదు అవ్వటం, అలాగే ధాన్యం మిల్లులో ఆడివంచినప్పుడు ముక్కలు కావటం జరిగి హెడ్ రైస్ రికవరీ శాతం తగ్గటం మొదలైన కారణాల వల్ల అటు రైతుకు సరైన ధాన్యం మద్దతు ధర లభించకపోవటం ఇటు మిల్లరుకు గిట్టుబాటు కాకపోవటం జరుగుతుందన్నారు. కావున రైతులు జాగ్రత్త వహించి వరి పంట పూర్తిగా తయారు అయిన తర్వాతనే వారి కంకులలోని గింజలన్నీ పూర్తిగా నిండి బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాతనే కోతలు ప్రారంభించవలసిందిగా వ్యవసాయశాఖ సూచిస్తుందన్నారు. అలాగే తుఫాన్ లేక అధిక వర్గాలు వచ్చే సూచనలు, వాతావరణ కేంద్రం వారి హెచ్చరికలు ఉన్నప్పుడు వరి కోతలు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసి కుప్పలు మీద ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్లు కప్పి సంరక్షించుకోవాలని సూచించారు. రైతులు ఈ సూచనలు పాటించాలని కోరారు.

Leave a Reply