ఏడుగురికి తీవ్రగాయాలు

ఏడుగురికి తీవ్రగాయాలు
ఐదుగురి పరిస్థితి విషమం
నరసన్నపేటలో జాతర గాబరా
ఆంధ్రప్రభ, నరసన్నపేట (శ్రీకాకుళం) : వీధుల్లో సందెమ్మ తల్లి ఊరేగుతోంది. డీజె సౌండ్ ఢమ ఢమ మోగుతుంటే.. భక్తులు చిందులతో సండడి చేస్తున్నారు. అలా.. ఊరేగింపు ముందుకు సాగిందో లేదో.. ఓ భవనం పోర్టికో కూలింది. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. ఆనందోత్సాహాల జాతర కాస్త.. ఊరి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదేం డీజేరా బాబు.. ప్రాణాల మీదకు వచ్చిందని ఆ గ్రామ జనం అల్లాడిపోతున్నారు. ఈ చిత్ర విచిత్ర ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లా నరసన్నపేట పట్టణంలోని భవానీపురం లో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
డీజే సౌండ్ (DJ Sound) తో భవనం పోర్టికో కూలిన ఘటనలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని మెడి కవర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నరసన్నపేట గొలివి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హుటాహుటిన ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
క్షతగాత్రుల తల్లిదండ్రులను ఓదార్చారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం (Better healing) అందించాలని కోరారు. ఎంపీపీ ఆరంగి మురళిధర్, జెడ్పీటీసీ చింతు రామారావు రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, మండల ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, సర్పంచ్ బురల్లి శంకర్, వార్డు సభ్యులు బంకుపల్లి శర్మ పాల్గొన్నారు. నందెమ్మ తల్లి ఉత్సవాలకు ఈ ఏడాది కొత్తగా డీజే సీస్టమ్ సౌండ్స్ తో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, డీజే సౌండ్స్ తాకిడితోనే పోర్టికో కూలిందని స్థానికులు తెలియచేస్తున్నారు.

