FARMER| రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు

FARMER|టెక్కలి, ఆంధ్రప్రభభ : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఆదిత్య కళ్యాణ మండపంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రైతు సంబర సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు దేశానికి వెన్నెముకని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధార పడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని .. కేవలం రూ. 7వేలు మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేశామని చెప్పారు.

సూపర్ సిక్స్ – సూపర్ సక్సెస్ అని అన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్ర వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ. 7 వేలు జమ చేశామని అన్నారు. తొలి విడత 46,85,838 మంది రైతులకు రూ. 3,175 కోట్ల మేర రైతులకు లబ్ది చేకూరిందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడతగా 46,85,838 మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ. 3135 కోట్ల సొమ్మును‌ రైతులు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో 42 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. ఈ సందర్భంగా రైతులకు రూ. 28.47 కోట్ల చెక్కును రైతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్య నాయకుడు బోయిన గోవిందరాజు, బోయిన రమేష్, పినకాన అజయ్ కుమార్, ఎల్ ఎల్ నాయుడు, హనుమంతు రామకృష్ణ, వెలమల విజయలక్ష్మీ, వెలమల కామేశ్వరరావు, మట్ట సుందరమ్మ, తర్ర రామకృష్ణ, కూచిట్టి కాంతారావు, చాపర గణపతి రావు, కోల్ల లవకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply