District SP | హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం..
District SP | హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం..
District SP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇటీవల కాలంలో హైవే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. డ్రైవర్లు మద్యం మత్తులో కూడా వాహనాల నడుపుతున్న రన్న ఫిర్యాదులు మేరకు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పోలీసులు వాహానాల డ్రైవర్లకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం చేపట్టారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సులు, ఇన్స్యూరెన్స్ వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ,ఆత్మకూరు, నంద్యాల, డోన్ సబ్ డివిజన్ లలోని నేషనల్ హైవేల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదనిన పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల హైవే పై జాగ్రత్తలు తీసుకున్నారు.
